VSP: శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నర్సీపట్నం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి దుర్గమ్మను దర్శించుకోవడానికి మహిళా భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.