TG: కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇవాళ ఆలయంలో జ్వాలా తోరణం నిశిపూజ నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి మహాపూజ చేయనున్నారు. కాగా, కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దాటితే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.