కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇష్టానుసారం హామీలు ఇస్తూ పోయింది. ఈ హామీల వల్ల పెరిగిన ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పన్నులు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైందట. కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన ‘గ్రీన్ సెస్’ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. దీని ప్రకారం.. పశ్చిమ కనుమల్లో పట్టే నదుల నీటిని వినియోగించుకునే నగరాల్లో నీటి బిల్లులపై రూ.2 నుంచి రూ.3 వసూలు చేస్తారు.