AP: వైసీపీ నేతల పేర్లతో ఫేక్ ఐడీలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్‌రెడ్డి సోషల్ మీడియా వెకిలి చేష్టలను పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారన్నారు. బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదని వివరించారు.