TG: రైతుల కోసం తాను ఎన్నిసార్లయినా జైలుకెళ్తానని.. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోండంటూ మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది.. అలాంటిది కేసీఆర్ రంగంలోకి దిగితే ఈ సర్కార్ పరిస్థితేంటి?. కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. లగచర్లలో జరిగింది దాడి కాదు, రైతుల నిరసన. అది దాడి కాదని స్వయంగా కలెక్టరే చెబుతున్నారు. రైతుల వ్యతిరేకతను మాకు ఆపాదించే కుట్ర చేస్తున్నారు’ అని అన్నారు.