AP: కూటమి బడ్జెట్‌పై కళ్లున్న కబోదిలా మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. బడ్జెట్లో సంక్షేమ పథకాలు కనిపించడం లేదని జగన్ అంటున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవకు రూ. 1,000 కోట్లు, పంటలబీమాకు రూ.1023 కోట్లు, మహిళల చేయూతకు రూ. 3,341 కోట్లు కేటాయించామని తెలిపారు. జగన్‌కు బాధ్యత ఉంటే అసంబ్లీకి రావాలని, అప్పులు, కాగ్ నివేదికలపై మాట్లాడాలని సూచించారు.