AP: సీఎం చంద్రబాబుతో సహా మంత్రులకు బడ్జెట్‌పై బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. బడ్జెట్ కేటాయింపులే దీనికి నిదర్శనమన్నారు. యనమల రామకృష్ణుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పడం టీడీపీకి అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు.