AP: విజయవాడలో సుబ్బయ్యగారి హోటల్ భోజనంలో జెర్రి కలకలం రేపింది. కస్టమర్ భోజనం చేస్తుండగా జెర్రి కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో కేంద్ర HRC ఇన్‌ఛార్జి ఛైర్మన్ విజయభారతి సయానీ భోజనం చేస్తున్నారు. దీంతో హోటల్ నిర్వాహకుల తీరుపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ సీరియస్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలించిన కార్పొరేషన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు.