దేశ రాజధాని ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకూ వాయు కాలుష్యం పెరుగుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 428కి చేరింది. ఈ సీజన్లో తొలిసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. కన్స్ట్రక్షన్ పనులను తాత్కాళికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఐదో తరగతి వరకూ విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.