TG: అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడంతోనే అరెస్ట్ చేశారన్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఎవరో నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా?’ అలాంటి వార్తలు నమ్మొద్దని తెలిపారు. తన స్థాయి అలాంటిది కాదన్నారు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్‌పై ఉందన్నారు. తాను సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తినన్నారు.