మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఆయన హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.