KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలను శ్రద్ధాభక్తులతో నిర్వహించాలని మేనేజర్ ఎస్.కే. శ్రీనివాసరావు కోరారు. మంగళవారం శ్రీ మఠం ప్రాంగణంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సేవా కేంద్రాలను కేటాయించారు. వాలంటీర్లకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక అధికారి శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ నరసింహమూర్తి పాల్గొన్నారు.