GNTR: నగర మేయర్, స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కోవెలమూడి రవీంద్ర (నాని) అధ్యక్షతన మంగళవారం గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ నందు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో నగరాభివృద్ధి కొరకు సభ్యులు ,అధికారులు ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనుల పై చర్చించి ప్రజోపయోగకరమైన పలు అంశాలను ఆమోదించుట జరిగింది.