VZM: ఎస్. కోట మండలం వినాయకపల్లి, తిమిడి, తలారి గ్రామాల్లో ఏవో కే.రవీంద్ర ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతులకు విత్తన శుద్ధిపై అవగాహన కల్పిస్తూ, రైతులతో వరి విత్తనాలను బీజమృతంతో శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు. విత్తన శుద్ధి ద్వారా విత్తనం పూర్తిస్థాయిలో మొలకెత్తుతుందని తెలిపారు.