సత్యసాయి: ఓడీచెరువు మండలం ఆకుతోటపల్లిలో ఫుడ్ పాయిజన్తో 15 మంది మహిళలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే, బాధితులకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు.