MNCL: ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కడం లేదన్నారు.