ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రేపు బ్రహ్మసముద్రం మండలంలోని సంతే కొండాపురం, ఎరడికేర, పాల వెంకటాపురం గ్రామాల్లో పర్యటించనున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రజావేదిక కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.