ELR: విద్యుత్ చార్జీల పోరుబాట కార్యక్రమంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు నారాయణపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుందని ఉంగుటూరు మండల వైసీపీ కన్వీనర్ మరడ మంగారావు తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు ఆధ్వర్యంలో జరిగే పోరుబాట కార్యక్రమానికి వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు.