VZM: రాష్ట్రంలో పెరిగిన కరెంటు ఛార్జిల మీద శుక్రవారం వైసీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తెలిపారు. ఈమేరకు చీపురుపల్లిలో రాజశేఖర రెడ్డి విగ్రహం నుంచి ర్యాలీగా ప్రారంభమై కరెంటు ఆఫీస్‌కి చేరుకొని అక్కడ అధికారులకు వినతి పత్రాన్ని అందిస్తారని అందరు కలసి ర్యాలీని విజయవంతం చేయాలన్నారు.