ఖలిస్థానీ వేర్పాటువాది అర్ష్ దల్లాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. అతన్ని ఇటీవల కెనడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందటంతో అతడిని భారత్‌కు అప్పగించాలని కెనడాను కోరతామని భారత అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన దల్లాపై 50కిపైగా కేసులు ఉన్నాయని, రెండేళ్ల క్రితం రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయ్యిందని తెలిపారు.