TG: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లీకుమారుడిని నడిరోడ్డుపై నాగరాజు అనే వ్యక్తి కత్తితో పొడిచి హతమార్చాడు. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో ఈ ఘటన జరిగింది. మృతులను సరోజాదేవి (50), అనిల్ (30)గా గుర్తించారు. 6 నెలల క్రితం తన రెండున్నరేళ్ల కుమారుడి మృతికి కారణమని భావిస్తూ కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.