AP: ప్రజలు జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మంత్రి లోకేశ్ అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేశ్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని వ్యాఖ్యానించారు. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని జగన్ గౌరవించట్లేదని భావించాలని అన్నారు. అసెంబ్లీకి రాకపోతే ప్రజలను అవమానించినట్లేనని పేర్కొన్నారు.