ప్రకాశం: మర్రిపూడి మండలం రావిల్లివారిపాలెం కస్తూరి గాంధీ పాఠశాలలో మండల విద్యాశాఖా అధికారి ఈవి రంగయ్య బంగారు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ.. బాల్యవివాహాలు నిర్మూలించాలని, బాల కార్మిక రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.