గాజాలో ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా పాలస్తీనా పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హమాస్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ పాలనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలస్తీనా మద్దతుదారులు నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితిని సృష్టించారని మండిపడింది. ఇజ్రాయెల్ దురాగతాలకు వ్యతిరేకంగా ఆ దేశ రాయబార కార్యాలయాల ఎదుట సాముహిక నిరసనలు చేయాలని తెలిపింది.