ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా’.. విద్యుత్ వాహన రంగం (EV)లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈనెల 27న హోండా తొలి ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. Activa Electric లేదా eActiva పేరుతో ఇది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.20 లక్షల వరకు ఉండవచ్చు. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100-110 కిమీల పరిధిని ఇస్తుందని తెలుస్తోంది. భారత్ లో విడుదల కానున్న ఈ స్కూటర్లో ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం.