CTR: పుత్తూరు పట్టణంలోని జండా మాన్ వీధిలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం ఎస్ఐకు వినతి పత్రం ఇచ్చారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఒక్కొక్కరి దగ్గర రూ.5వేల నుంచి రూ.15వేల వరకు డబ్బులు కట్టించుకున్నారని తెలిపారు. విద్యార్థులు తరగతులు ఎప్పటినుంచి మొదలు పెడతారని అడుగుతుంటే నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని తెలిపారు.