KKD: మత్స్యకార దినోత్సవం సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన గురువారం పిఠాపురంలోని పార్టీ కార్యలయం వద్ద మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో మత్స్యకారులకు సీసీ రోడ్లు సామూహిక మరుగుదొడ్లు నిర్మించామని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.