AP: రేషన్ బియ్యం రవాణాకు సంబంధించి మంత్రి పయ్యావుల వియ్యంకుడిపై మాజీమంత్రి పేర్నినాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పయ్యావుల స్పందించారు. ‘మా వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేయట్లేదు. మూడు తరాలుగా మా వియ్యంకులు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తున్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే చెక్‌పోస్ట్ పెట్టి ప్రతి బ్యాగ్ తనిఖీ చేసుకోవచ్చు. చెక్‌పోస్టు పెట్టుకుంటానంటే కుర్చీ, టెంట్ కూడా ఏర్పాటు చేస్తా’ అని పేర్కొన్నారు.