ప్రపంచస్థాయిలో ఏటా ప్రజలు ఇష్టంగా తినే ఆహార పదార్థాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్ అట్లాస్ అనే సంస్థ విడుదల చేస్తోంది. ఈ జాబితాలో తమిళనాడులో తయారవుతున్న చికెన్ 65 మూడో స్థానంలో నిలించింది. కాగా, 1960లో తమిళనాడులో బుఖారీ అనే ఆహార సంస్థ ఈ చికెన్ 65 తయారీ ప్రారంభించినట్లు సమాచారం. ఈ జాబితాలో చైనాకు చెందిన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్, తైవాన్‌కు చెందిన బాంబకాన్ చికెన్ తదితరాలు కూడా చోటుచేసుకున్నాయి.