అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపుపై వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ స్పందించాడు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ ప్రశ్నించాడు. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజాసేవ కోసం కాదు అని పేర్కొన్నాడు.