TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం చిరుతను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుతకు స్వల్ప గాయాలు కావడంతో చాలా సేపు రోడ్డుపైనే ఉంది. దీంతో చిరుతను చూసిన వాహనదారులు భయాందోళనకు గురైయ్యారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపైనే పడుకున్న చిరుత.. అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు.