TG: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ప్రకటించిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ‘రైతులు పండించిన సగం ధాన్యం దళారులపాలైంది. సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా.. ఎప్పుడు వస్తావో రా.. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం. బ్లాక్మెయిల్ రాజకీయాలకు నేను భయపడను’ అని పేర్కొన్నారు.