ELR: ఏలూరు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.13 లక్షలతో కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లను మేయర్ నూర్జహాన్ పెదబాబు జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఉదయం 7 నుంచి 11 వరకు ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరణ జరుగుతుందన్నారు.