TG: రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు మంచిర్యాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురు కాసేపటి క్రితం మంచిర్యాలకు చేరుకున్నారు. వారికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ దీపక్ స్వాగతం పలికారు. రూ.360 కోట్లతో చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మంత్రులు భూమి పూజ చేయనున్నారు. అనంతరం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి జనం భారీగా తరలివచ్చారు.