PLD: అమరావతి అభివృద్ధి కొరకు ప్రభుత్వం రూ.11,000 కోట్లను కేటాయించడం శుభ పరిణామం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అమరావతిని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిందని అన్నారు. అమరావతి కొరకు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులను అనేక రకాలుగా అవహేళనకు గురిచేసి ఎందరో ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు.