ఫేస్ వాష్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫేస్ వాష్ చేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా కడగకూడదు. ఎక్కువసార్లు కడిగితే స్కిన్ పొడిగా, గరుకుగా మారుతుంది. ముఖాన్ని గట్టిగా రుద్దుతూ వాష్ చేయకూడదు. అలా చేస్తే చర్మంపై పగుళ్లు ఏర్పడతాయి. గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. సబ్బు వాడకూడదు. చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్‌ను ఉపయోగించడం మంచిది.