TG: చైతూ-సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ కారణంగా హీరో నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని హైకోర్టులో నాగ్ తరఫు న్యాయవాది అశోక్ వాదించారు. ఈ కేసు విచారణ ఈరోజు జరగ్గా.. నాగార్జునపై మంత్రి కొండా సురేఖ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని న్యాయవాది అశోక్ ఆరోపించారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్లో పెట్టిన పోస్టును కోర్టుకు ఆయన చదివి వినిపించారు.