VSP: లా కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ప్రియాంక దండి అన్నారు. గురువారం పార్టీ నాయకులతో కలిసి ఎండాడ పోలీస్ స్టేషన్కు చేరుకొని కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.