అమెరికాలో లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ ప్రకటన చేసింది. యూస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తమ సంస్థపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం, ఖండిస్తున్నామని తెలిపింది. తమ సంస్థ పూర్తిగా పారదర్శకతతో నిబంధనలు పాటిస్తుందని పేర్కొంది. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేసింది. తాము చట్టాలకు కట్టుబడి ఉంటామని చెప్పింది.