AP: శాసనమండలిలో నిరుద్యోగ సమస్యలపై చర్చలు జరిగాయి. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఏవని ఎమ్మెల్సీ రఘుబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి లోకేశ్.. నిరుద్యోగ భృతి తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో యువతకి ఇచ్చిన హామీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.