ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించింది. తొలుత వద్దని భావించిన ఇంట్రాస్క్వాడ్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌ను ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. అయితే, ప్రేక్షకులు ఎవరూ లేకుండా ఉండేలా చూడాలని బీసీసీఐ కోరినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ అవన్నీ రూమర్లేనని తెలిపింది. తాము ఎలాంటి విజ్ఞప్తులు చేయలేదని స్పష్టం చేసింది.