సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలు రాసే 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. సిలబస్ లో 15 శాతం వరకు తగ్గిస్తూ ప్రకటించింది. చదువుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచి, బట్టీ విధానాన్ని తగ్గించడానికి విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2025 ఎగ్జామ్లో సిలబస్ మార్పు అమలవుతుందని CBSE భోపాల్ రీజనల్ ఆఫీసర్ వికాస్ కుమార్ అగర్వాల్ తెలిపారు.