ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ గనుల శాఖ పెవిలియన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రపంచంలోనే కోల్ ఇండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు అని పేర్కొన్నారు. బొగ్గు పరిశ్రమలో ప్రమాదాలు లేకుండా కార్మికుల క్షేమమే ప్రధాన అజెండాగా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు కోల్ ఇండియా ఫౌండేషన్ డే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.