బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి ‘సెక్యూలర్’ అనే పదం తొలగించాలని ఆ దేశ అటార్ని జనరల్ ఎండీ అసదుజ్జమాన్ వ్యాఖ్యానించారు. 90 శాతం మంది ప్రజలు ఒకే మతానికి చెందిన వారు కావటంతో ఇది అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీం కోర్టులో అటార్ని జనరల్ వాదనలు వినిపించారు. రాజ్యంగ సవరణలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించాలి.. అంతేకానీ, నియంతృత్వాన్ని కాదని అన్నారు.