కేరళ ప్రభుత్వం శబరిమల యాత్రికుల సేవలకు ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్ అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా భక్తులకు 6 భాషల్లో ఇంగ్లిష్, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీలో అయ్యప్ప స్వామి సమగ్ర వివరాలు లభ్యమయ్యేలా ఇందులో రూపొందించారు. శబరిమలలో పూజాసమయాలు, ఇతర విశేషాలే కాకుండా భక్తులు విమానాలు, రైళ్లు, స్థానిక పోలీసుల వివరాలు, అటవీశాఖ సేవలను ‘స్వామి’ ద్వారా పొందవచ్చు.