TG: ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే TGPSC గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని CS శాంతికుమారి సూచించారు. పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని.. పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 ఎగ్జామ్ సెంటర్లలో దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.