పాతబస్తీ ముస్లీంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఓ విజ్ఞప్తి చేశారు. పాతబస్తి ముస్లీంలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది లేదని, వారికి అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ పైన విమర్శలు గుప్పించారు. పాతబస్తీకి మెట్రో లైన్ కోసం బీజేపీ దీక్ష చేస్తే అరెస్ట్ చేశారని, ఇది దారుణమన్నారు. పాతబస్తీ అభివృద్ధి చెందాలంటే మెట్రో నిర్మాణం అవసరమని, కానీ ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. బీజేపీ డిమాండ్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పాలని నిలదీశారు.