»Metro To Old City Charminar 5 5 Km Works Are Going On Nvs Reddy
Old City: చార్మినార్ కు మెట్రో..పనులు షురూ
ఎట్టకేలకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ(Old City) చార్మినార్ కు మెట్రో(metro) రాబోతుంది. ట్రాఫిక్ కష్టాలతోపాటు చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ పనులను ఇప్పటికే ప్రారంభించామని తాజాగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ(Old City)లో మెట్రో(metro) పనులు ప్రారంభించినట్లు HMRL మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో 5.5km బ్యాలెన్స్ మెట్రో అలైన్మెంట్ త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. MGBS నుంచి దారుల్షిఫా జంక్షన్ – పురానీ హవేలీ – ఎట్టెబార్ చౌక్ – అలీజాకోట్ల – మీర్ మోమిన్ దైరా – హరిబౌలి – శాలిబండ – శంషీర్‌గంజ్, అలీబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ మార్గం ఉంటుందన్నారు. ఈ ప్రాంతాల్లో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్(Charminar), శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా ఐదు స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు. మెట్రో స్టేషన్లు సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్లు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న ప్రాముఖ్యత, వాటి స్థలం, టూరిస్టుల రాక దృష్ట్యా వాటి పేర్లు పెట్టనున్నట్లు ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 స్మశాన వాటికలు, 6 చిల్లాలతో సహా 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఈ మార్గంలో ఉన్నాయని పేర్కొన్నారు. వక్రత, వయాడక్ట్ డిజైన్, ఎత్తుల సర్దుబాటు వంటి ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని మతపరమైన నిర్మాణాలలో నాలుగు మినహా మిగిలినవి సేవ్ చేయబడ్డాయి HMRL MD అన్నారు.
సీఎం, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) కేటీఆర్ సూచనల మేరకు మిగిలిన నాలుగు మతపరమైన నిర్మాణాలను కూడా రక్షించడానికి మెట్రో అలైన్మెంట్ ఇంజినీరింగ్ మరింత పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. ఆ క్రమంలో మతపరమైన నిర్మాణాలను కాపాడేందుకు, రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయబడుతుందని పేర్కొన్నారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి దశ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకుని, స్టేషన్ స్థానాల్లో రోడ్ల(roads)ను 120 అడుగులకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ ప్రారంభమైందని, ఒక నెలలో భూసేకరణ నోటీసులు జారీ చేస్తామని ఎన్విఎస్ రెడ్డి స్పష్టం చేశారు.