Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రచార రథం వారాహికి పవన్ ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో మూడు ఆప్షన్లు తమకు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కొండగట్టులో తొలిసారి వారాహి వాహనం ఎక్కి తన అభిమానులను, జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని బృందావనం రిసార్ట్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఒక్కోసారి పెద్ద స్థాయి ఆట ఆడాలంటే చిన్న స్థాయిలో మనం తప్పుకోవాల్సి వస్తుంది. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ విరమించుకున్నాం. కానీ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాం. అది పరిమిత స్థాయిలో ఉంటుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీకి సిద్ధం
•జనసేన అభ్యర్ధుల గెలుపు కోసం నియోజకవర్గాల్లో తిరుగుతా
• ఏపీలో నేను ఎదుర్కొంటున్న నాయకులు మామూలోళ్లు కాదు