వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఆగస్టు 14వ తేదిన ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఎనిమిదవ నిందితుడిగా చేర్చుతూ కోర్టు పేర్కొంది.
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా భేటీ అయ్యారు. వీరు ఏ అంశాలపై చర్చలు జరిపారని ఇరు పార్టీనేతల్లో ఆసక్తి నెలకొంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) పోటీ చేసే స్థానంలో వాలంటీర్ ను నిలబెడతామని ఏపీ మంత్రి జోగి రమేష్(jogi ramesh) పేర్కొన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ ఒంటరిగా మీ పార్టీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా వైసీపీ తరఫున ఓ వాలంటీర్ ను నిలబెట్టి చిత్తు చిత్తుగా ఓడిస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అసలు పవన్ కు ఏపీలో తిరిగేందుకు అర్హత లేదని ఆరోపించారు. [&he...
ఏపీలో సీఎం జగన్ పాలన దుర్మార్గంగా సాగుతోందని, వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా మంది యువత పరిస్థితి దారుణంగా తయారైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో జగ్గూ గ్యాంగ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసని, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జలగలను వదిలిపెట్టనని అన్నారు.
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి సామాజిక కార్యకర్త సలీం తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. అధికారం ఉంది కదా అని అమాయకులపై కేసులు పెట్టి వేధించొద్దు అని సూచించారు.
సొంత బాబాయ్‌ని చంపించి, పదో తరగతి విద్యార్థిని కూడా వదలని కర్కశకుడు సీఎం జగన్ అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఈ రోజు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీని స్వీకరించారు.
టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షలో చూచిరాతలేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజ్ స్కామ్‌లో ఎందరు అరెస్ట్ అయ్యారో చూశాం అన్నారు.
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. అలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో APPSCలో కూడా స్కాంలు జరిగాయని గుర్తు చేశారు. అంతేకాదు అసలు ఏపీకి ఇప్పటివరకు రాజధాని కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ అనేక మంది హైదరాబాద్లోనే ఉంటున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పలువురికి హైదరాబాద్ కు రాకపోతే వారికి పూట కూడా గడవదని వ్యాఖ్యలు చేశారు.